TT Ads

ఏప్రిల్ 12 ఖమ్మం : ఖమ్మం జిల్లా మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసీ ఖమ్మం జిల్లా రెండవ మహా సభ మే 22,23వ తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో కరుణగిరిలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు సోమవారం ఖమ్మం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మహా సభ కరపత్రాలు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా లో ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు వైరా పురపాలక సంఘం, సత్తుపల్లి పురపాలక సంఘం, మధిర మున్సిపాలిటీల పరిధిలో వందలాది మంది పారిశుధ్యం, వాటర్ సప్లయి, ఎలక్ట్రిసిటి మరియు గార్డెన్ తదితర రంగాలలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తదితర పద్ధతులలో పనిచేస్తున్నారని. వీరికి ఉద్యోగ భద్రత లేదని, కార్టోరేషన్ మరియు వివిధ మున్సిపాలిటీలో పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచక పోవటం వలన పని భారంతో సతమతమౌతున్నారని తెలిపారు.

సమాన పనికి సమాన వేతనం, కార్మికుల హక్కుల సాధనం కోసం నిరంతరం పోరాడుతుందని కార్పోరేషన్,మున్సిపాలి టీలలో ఎన్.యం.ఆర్. కాంట్రాక్ట్ జీతాల పెంపుదల కోసం,కార్మికుల రక్షణ పరికరాలు,పి.ఎఫ్.ఇ.ఎస్.ఐ.తదితర సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి.కేసులను ఎదుర్కొన్న చరిత్ర కలిగింది ఏఐటియుసీ అని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పి.ఆర్.సి.ని వర్తింపచేస్తూ జిల్లాలో గల కార్పోరేషన్, మున్సిపాలిటీలలో కేటగిరీల వారీగా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాల చట్టం అమలు చేస్తూ కార్మికునికి నెలకు రూ. 24వేలుగా నిర్ణయించి జీతాలు చెల్లించాలని ప్రభుత్వంతో కార్మికుల పక్షాన ఏ.ఐ.టి.యు.సి. కార్మిక సంఘం పోరాడుతుందని.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోలుగా విభజించి 8 గంటల పని విధానానికి బదులు 12 గంటలు కార్మికులు పనిచేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులు చట్టాల పరిరక్షణకై అనేక పోరాటాలకు సమర శంఖారావం పూరించుటకై కె.సి.ఆర్.ప్రభుత్వం గత ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్కార్మికులకు ఇచ్చిన హామీలు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ రద్దుచేసి కార్మికులందరిని రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు.

కరోనా విపత్తు,అధిక వర్షాలు సంభవించినప్పుడు ప్రజల ఆరోగ్యాలే లక్ష్యంగా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ సూచనలు పాటిస్తూ శక్తి వంచన లేకుండా ప్రాణాలకు తెగించి ముందు వరసలో నిలబడి పనిచేసి చేస్తున్న మున్సిపల్ కార్మికులను కె.సి.ఆర్. ప్రభుత్వం‌ విస్మరించిందని ఆవేదన వ్యక్తంచేశారు.

స్వచ్చ భారత్ పేరుతో ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న ప్రజా ధనాన్ని మున్సిపల్ కార్మికుల సంక్షేమా
నికి వినియోగించాలని డిమాండ్ చేస్తూ. ఈ క్రమంలోనే మరిన్ని ఉద్యమాల నిర్మాణం కోసం 22, 23 మే 2021న ఖమ్మం జిల్లా కేంద్రంలో కరుణగిరి ప్రాంగణంలో జరిగే ఖమ్మం జిల్లా మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి. ఖమ్మం జిల్లా 2వ మహాసభకు మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో కదలి జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు బొడ్డు పాపారావు, కె. తిరపయ్య, రామారావు, గోపయ్య, కృష్ణ, తిరపయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *