TT Ads

ఏప్రిల్ 02 ఖమ్మం : ఇది ప్రజాస్వామ్య దేశమేనా, ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని కలకూడదా ఇదెక్కడి అన్యాయం హక్కులు అడిగితే అక్రమ అరేస్టులు చేస్తారా అని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఖమ్మం నూతన బస్టాండ్ ఎదుట ఏఐటియుసీ మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు.ఏఐటియుసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, ఏఐటియుసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు పేరబోయిన మోహన్ రావు లను అక్రమంగా అరేస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

ఈ సందర్భంగా మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రకటించిన పీఆర్సీని మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సిబ్బందికి వర్తింపజేయాలని ఖమ్మం జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను నూతన బస్టాండ్ ప్రాంగణంలో కవసి మున్సిపల్ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సిబ్బందికి వర్తింపజేయాలని రాష్ట్రంలో అత్యవసర ఆరోగ్య సమస్యలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా ప్రజా ప్రయోజనాల కోసం మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సిబ్బంది ముందు వరసలో నిలబడి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు చేల్లించాలని అడగడం నేరామా మమ్మలను అరేస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అక్రమంగా అరెస్టులు చేసిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *