TT Ads

అనంతపురం జిల్లా , కదిరి పట్టణం లోని ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి వెంటనే ఆక్సిజన్ సరఫరా చేయాలి .రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా వందలాది మంది మరణిస్తున్నారు.నేడు అనంతపురం జిల్లా , కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా కోవిద్ ఆసుపత్రిలో కూడా అవసరమైన ఆక్సిజన్ లేక రోగులు మరణించడం భాధాకరం. తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ను సరఫరా చేసి రోగుల ప్రాణాలు రక్షించాలి.చాలా ఆసుపత్రులలో మంచాలు లేక ఒకే మంచంపై ఇద్దరు చొప్పున, చాపలపై నేలమీద రోగులను పడుకోబెడుతున్నారు.ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను వెంటనే పెంచాలి .మరియు అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలి.అధికారులు కరోనా విస్తరణను, ఉదృతిని ముందస్తుగా అంచనా వేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది .ఆక్సిజన్ సమస్య ఏరియా ఆసుపత్రులలో రాగానే, రాష్ట్రప్రభుత్వం సరఫరా చేయాలంటే చాలా సమయం పడుతుంది .రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం ఏరియా ఆసుపత్రులన్నింటిలోను యద్ధప్రాతిపదికన తాత్కాలిక స్టోరేజ్ ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసి సరఫరా చేయాలి.అధికారులు పరిశీలించి ప్రభుత్వం కదిరి పట్టణంలోని ప్రభుత్వ కోవిద్ ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్ యూనిట్ ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.అన్ని జిల్లా ప్రభుత్వా ఆసుపత్రులలో కూడ ఆక్సిజన్ సమస్యను పరిష్కరించి, పేదలను ఆదుకోవాలని కోరుతున్నాను .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *