TT Ads

టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తుంది. టెండర్ లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జి ఎస్ టి కట్టించుకుని తలనీలాలు అప్పగించడం జరుగుతుంది. కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా ? లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదు.

దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాము.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *