TT Ads

తెలుగునాట తొలితరం స్వయంసేవకులలో ఒకరు, సంఘవ్యాప్తికై ఒక క్షణం ఆలోచించకుండా కుటుంబంతో వరంగల్లుకు తరలివెళ్లి కృషిచేసిన వారు, తెలుగునాట సంఘచరిత్రను గ్రంథస్థంచేసిన వారు మనకు ఇక అందుబాటులోలేరు.

దాదాపుగా రెండుసంవత్సరాలుగా ఇంటికి, అందు లోనూ ఎక్కువ సమయం మంచానికీ పరిమితమై ఉన్నా , అన్ని విషయాలలో అప్ టు డేట్ గా ఉన్నారు. వీలైతే కూర్చొని,అది సాధ్యంకాకపోతే పడుకొని అన్ని విషయాలూ మాట్లాడేవారు.వాకాడు(విద్యానగర్), వికారాబాద్ లోనూ లెక్చరర్ గా పనిచేశారు. విజయవాడలో శారదా జూనియర్ కాలేజి, సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఉద్యోగవిరమణ తర్వాత మూడు సంవత్సరాలపాటు చత్తీస్ గఢ్ వెళ్లి వనవాసుల సేవలో కొత్త కోణాలను ఆవిష్కరించి వచ్చారు.

రాష్ట్రీయ స్వయం సేవక సంఘమేగాక, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా వారి మార్గదర్శనం పొందింది. సమాలోచన అనే మేధావుల వేదికకు వారు చిరకాలం అధ్యక్షులుగా ఉండి ఎందరో పెద్దలను విజయవాడకు పిలిపించి ఉపన్యాసా లిప్పించారు.

జాగృతి పత్రికలో దశాబ్దంపైగా మనలోమాట అనే శీర్షికను నిర్వహించారు. రాణాప్రతాప్,.ఎదిగిన మనిషి(నవల), తరంమారింది (కథల సంపుటి), వికసిత సంఘ కుసుమం (మా. సోమేపల్లి సోమయ్యగారి జీవిత పరిచయం) దారిచూపిన దీపకళిక (శ్రీ గురూజీ జీవిత పరిచయం), వనయోగి (బాలాసాహెబ్ దేశపాండే జీవితపరిచయం), మరువ రాని మహామహులు మొదలైన ఎన్నో గ్రంథాలు రచించారు.

విజయవాడలో, ఆ సమీప జిల్లాలో సంఘానికి, జాతీయభావంతో మెలగే ఉద్యమాలకూ పెద్దదిక్కుగా ఉండిన శ్రీగోపిరెడ్డిగారి మరణం ఒక పెద్దలోటు. ఈ కష్టాన్ని భరించగల.శక్తిని పరమేశ్వరుడు వారి కుటుంబానికి అందించాలని ప్రార్థిస్తున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *