TT Ads

శ్రీరామ నవమి పండుగ సందర్బంగా మానుక గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అధినేత అదేశాలమేరకు ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ జె.క్రాంతి కుమార్ , ఇంచార్జ్ మంజుల , ఆకౌంటెంట్ డి.పావని మరియు వారి సిబ్బంది కలసి నగరంలోని జీవన సంధ్య వృద్ధాశ్రమం నందు నిత్యావసర వస్తువులు , పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సేవ కార్యక్రమంలో పాల్గొనటం మాకు చాలా ఆనందంగా ఉందని, ఇలాగ వృద్ధులతో కలిసి నేడు వారితో గడపటం , వారి కష్ట సుఖాలను తెలుసుకోవడం జరిగిందని వారు తెలియజేసారు. ఇలాగే మానవతా దృక్పథంతో వృద్దులకు , మానసిక వికలాంగులకు , అనాధ పిల్లలకు అండగా ఉండి ప్రతిఒక్కరూ సేవాభావంతో సహాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు వృద్ధాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *