TT Ads

కడప జిల్లా:మానవత్వం చాటుకున్న బ్రహ్మంగారి మఠం ఎస్సై శ్రీనివాసులు.పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన గుర్తుతెలియని వృద్ధుడిని ఎత్తుకుని తన వాహనంలో అస్పత్రికి తరలించిన ఎస్సై శ్రీనివాసులుబ్రహ్మంగారిమఠం ఎస్సై శ్రీనివాసులు ‘బ్రహ్మం సాగర్ వద్ద ఒక గుర్తు తెలియని సుమారు 70 ఏండ్ల వయస్సు ఉన్న ఒక వృద్దుడు పురుగులమందు సేవించి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి, తన వాహనంలో వైద్య సేవలు కొరకు తీసుకొనివెళ్ళారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్న ఈ సమయంలో ఒక వృద్ధుని తన వాహనంలో తీసుకెళ్లి, వైద్య సేవలు అందించడం హర్షించదగ్గ విషయం.మానవత్వం చూపిన ఎస్సైని స్థానికులు అభినందించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *