TT Ads

రంగారెడ్డి:మైలార్ దేవుపల్లి వట్టేపల్లి లో మాజీ రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసును ఛేదించిన మైలార్ దేవిపల్లి పోలీసులు.మిట్ట మద్యాహ్నం అందరూ చూస్తుండగా అసద్ ఖాన్ కు అతి దారుణం హత్య చేసిన ప్రత్యర్థులు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు.

ఆరు మంది తో కూడిన ముఠా సభ్యులు బులెట్ పై వెళుతున్న అసద్ ఖాన్ ను అడ్డగించి వేట కొడవళ్ల తో దాడి. మేరుపు దాడి చేసిన ప్రత్యర్థులు. విచక్షణారహితంగా తల పై పలు మార్లు కత్తులతో దాడి. మృతి చెందాడని నిర్దారించుకున్న తర్వాత ఆటోలో పారారైన దుండగులు. తీవ్ర రక్తస్రావమై స్పాట్ లోనే మృతి చెందిన అసద్ ఖాన్.

హత్య జరిగి 12 గంటల లోపే హంతకులను పట్టుకున్న శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు,మైలార్ దేవిపల్లి పోలీసులు.పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసి నట్లు ఒప్పుకున్న హంతకులు. 2018 సంవత్సరంలో అంజద్ ఖాన్ హత్యకు ప్రతీకారమే అసద్ ఖాన్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్న ప్రధాన నిందితుడు.మరి కాసేపట్లో హంతకులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న శంషాబాద్ డి సి పి ప్రకాష్ రెడ్డి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *