TT Ads

ఖమ్మం : మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ కరోనాతో మృతి చెందడం విచారకరమని , ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని , వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్.హెచ్.పి.ఎస్.) రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు బద్రునాయక్ ప్రకటించారు . ఈ మేరకు శుక్రవారం జారీ చేసిన తన ప్రకటనలో కరోనా సోకి , సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాజీ మంత్రి చందూలాల్ మృతి చెందడం బాధాకరమన్నారు . ములుగు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో గిరిజన శాఖమంత్రిగా సేవలందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *