TT Ads

మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్యం నిలకడగా ఉందని విశాఖలోని ప్రైవేట్​ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు.చికిత్సకు కొంతవరకు సబ్బం హరి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు.ఏప్రిల్​ 15న కొవిడ్​ నిర్ధారణ కాగా డాక్టర్ల సూచన మేరకు హోం ఐసోలేషన్​లో ఉన్నారు.బుధవారం ఆసుపత్రికి షిఫ్ట్​ అయ్యారు.ప్రస్తుతం వెంటిలేటర్​పై ఉన్నారు.సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు.ఆయన ఆరోగ్యంపై వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *