TT Ads

పల్నాడు ప్రాంతంలో ప్రధాన రహదారులైన కొండమోడు– పేరేచర్ల, దాచేపల్లి నుంచి రెంటచింతల మీదుగా మాచర్ల పోవు మార్గాలకు మహర్ధశ కల్గింది.ఈ రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు ఇస్తూ.. కేంద్రం నేడు గెజిట్‌ను విడుదల చేసింది.

కొండమోడు –పేరేచర్ల మార్గాన్ని 167 ఏజీ గా, దాచేపల్లి –మాచర్ల మార్గాన్ని 167 ఏడీగా కేంద్రం గుర్తింపు ఇచ్చింది.ప్రమాదాల నెలవులుగా ఈ రెండు మార్గాలను విస్తరించాల్సిందిగా.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గారిని, అధికారులను నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు . అనేక మార్లు కలసి విన్నవించారు.

ప్రజారవాణాకు, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసుకోవటంలో కీలక పాత్ర పోషించే.. ఈ మార్గాలను విస్తరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

నాలుగు వరసల రహదారిగా విస్తరణ జరిగి ప్రజలకు అందుబాటులోకి రానుంది.నేడు గెజిట్‌ను విడుదల చేయటం హర్షణీయం.దశల వారీగా ఈ రహదారి విస్తరణ జరిగి పల్నాడు వాసులకు అందుబాటులోకి రానుంది.కేంద్ర ప్రభుత్వానికి, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను – ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *