TT Ads

గుంటూరు జిల్లా:మాచర్ల పట్టణంలోని బస్టాండ్ వద్ద శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మాచర్ల రూరల్ పోలిస్ స్టేషన్ ఎదురుగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, కమీషనర్ గీరి కుమార్, హాజరై ముందుగా గోవిందరెడ్డితో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

అనంతరం మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్, కమీషనర్ గిరి కుమార్ చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం సందర్భంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి అధ్వర్యంలో చలివేంద్రాంని ఏర్పాటు చేయడం చాలా అనంద దాయకంగా ఉందని అన్నారు

అంతేకాకుండా మెట్టు గోవిందరెడ్డి అధ్వర్యంలో మాచర్ల పరిసర గ్రామ ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అవసరమైనా వారి అవసరాలు తీర్చేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు గత సంవత్సరం కరోనా సమయంలో మెట్టు గోవిందరెడ్డి చేసిన సేవాలను వారు కొనియాడారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కుడా మూడు పూటలా నిత్య అన్నదానం చేయుట హర్షించదగిన విషయం అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ పట్టణ ఆర్వో రమణబాబు, సేవా సమితి కోశాధికారి చింతలపూడి వేంకటేశ్వర రెడ్డి, సభ్యులు గాజుల నరసింహారావు ,సంగీత ఉపాధ్యాయులు షేక్ లాల్ సాహేబ్, మెట్టు రాఘరామిరెడ్డి, మల్లయ్య, చంద్ర రావు, సతీష్ అయ్యగారు, గట్ల నరపరెడ్డి, రామకృష్ణ, పరిటాల ధనలక్ష్మి, లక్ష్మి, మెట్టు రుపా శ్రీ, తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *