TT Ads

ఖమ్మం : Sk మీరబీ వయసు 80 సంవత్సరాలు చేసే వృత్తి వీధి గారడీ , గారడి అంటే అందరినీ నవ్వించడం వరంగల్ నుంచి వలస వచ్చి దాదాపుగా 50 సంవత్సరాలు అవుతుంది . నాకు ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుర్లు ఫ్యామిలీ మొత్తం 17 మంది మాకు ఖమ్మంలో ఉండటానికి ఇల్లు లేదు దాదాపు 20 సంవత్సరాలుగా 47వ డివిజన్ బొక్కల గడ్డ లో ఖాళీ స్థలం ముందు పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఉన్నాం . ఆ స్థలం యజమాని వచ్చి మీ గుడారాలు తీసేయండి అని చెబితే ఇప్పుడు మేము కిరాయికి 47వ డివిజన్ బొక్కల గడ్డ లో ఉంటున్నాము . కరోనా వల్ల ఎటు వెళ్ళలేని పరిస్థితి దయచేసి మా ఖమ్మం జిల్లా రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి , అలాగే మా కార్పొరేటర్ 47వ డివిజన్ మాటేటి నాగేశ్వరావు గారికి మా విన్నపం ఏమిటంటే అయ్యా మాకు ఉండటానికి స్థలాలు చూపించండి . మీరు డబల్ బెడ్ రూమ్ ఇస్తున్నారు మాకు ఒకటి ఇప్పించండి . ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మాది , స్థలం కూడా కొనలేని పరిస్థితి మాది శ్రీనివాస థియేటర్ ముందు పాములాట పెట్టుకుంటూ తెలంగాణలో దాదాపుగా 50 సంవత్సరాలుగా ఉంటున్నాము . మాది ఇంతకు ముందు వరంగల్ రెడ్డి కాలనీ ఇప్పుడు ఖమ్మం బొక్కల గడ్డ దయచేసి పెద్దలు మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూనాము .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *