TT Ads

హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ , ఇతర పోలీసు ఉన్నతాధికారులు.మహిళ పై హత్యకు పాల్పడిన వారిలో నలుగురు నుండి ఐదుగురు ఆగంతకులు పాల్గొన్నట్లు , ఈ హత్య కు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణం అని తెలిపారు.

మంజుల భర్త పరిమల్ అగర్వాల్ మెడికల్ వ్యాపారం చేస్తుండే వారని , వ్యాపార లావాదేవీలలో భాగంగా డబ్బులు తీసుకున్న వారికి తిరిగి చెల్లించక పోవడం , అప్పులు ఇచ్చిన వారికి అందుబాటులో ఉండకపోవడం ,
ఇంటికీ వస్తే ఇంట్లో ఉండక పోవడంతో , ఈరోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కూడా కొంతమంది అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి , నీ భర్త ఆచూకీ చెప్పమని అడగగా , అందుకు మంజుల నా భర్తకు నాకు ఎలాంటి సంబంధం లేదని , గత కొన్ని నెలలుగా దూరం ఉంటున్నామని చెప్పగా , అప్పు ఇచ్చిన వారు ఆమెతో వాగ్వాదంకు దిగి , అప్పు ఇచ్చిన వారిలో ఒకరు కోపోద్రుక్తులై కత్తి తో ఆమెపై దాడికి పాల్పడి అక్కడినుండి పరారు కావడం జరిగింది.

స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించగా తీవ్ర గాయలై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతు అక్కడికక్కడే మృతిచెందడం జరిగిందనీ , అన్నీ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు , త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్ష పడే విదంగా చేస్తామని ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *