TT Ads

కోవెలకుంట్ల: మండలంలో పని చేస్తున్న ఇద్దరు వీఆర్వోలు తనతో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని ఓ మహిళా వాలంటీర్‌ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.సదరు వాలంటీర్‌ స్థానికంగా లేదన్న నెపంతో బెదిరిస్తూ తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఆమె విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ ఇద్దరు వీఆర్వోలను స్టేషన్‌కు పిలిపించి గట్టిగా మందలించినట్లు తెలిసింది. ఇది తెలిసిన ఓ ప్రజాప్రతినిధికి తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇలాంటి ఘటనల వల్ల తమకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, తాను చర్యలు తీసుకోకముందే బదిలీపై వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం.ఈ విషయమై ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడగా.. సమస్య తమ దృష్టికి రావడంతో ఇద్దరు వీఆర్వోలను పిలిపించి హెచ్చరించామని, రాత పూర్వకంగా ఫిర్యాదు లేదన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *