TT Ads

జిల్లా పరిషత్ సీ ఈ ఓ ప్రియాంక
ఖమ్మం. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన నాడే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని జడ్పీ సీఈవో ప్రియాంక అన్నారు. సోమవారం కెనరా బ్యాంక్ ప్రధాన కార్యాలయం నందు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన పలురకాల స్టాళ్లను ఆమె సందర్శించి పరిశీలించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళలే కాకుండా యావత్ ప్రపంచం ఎంతో ఘనంగా చేసుకోవటం హర్షించదగ్గ విషయమని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రంతో పాటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సొసైటీలో ఉన్నత స్థాయిలో ఉండుటకు కృషి చేయాలన్నారు.మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహించడంతోపాటు సమాజాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మహిళల, పురుషుల కూడా అభివృద్ధి చెందడానికి, ఎదుగుదలకు ఎటువంటి కొలమానం ఉండనవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఒక కళ ఉంటుందని దానిని వెలికితీయడానికి మనం కృషి చేయాలన్నారు. మహిళలు ఆహ్లాదకరంగా మానసిక శారీరక దూరంగా ఉండాలని అప్పుడే సమాజం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వస్తే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందన్నారు అమ్మాయిలు, అబ్బాయిల పట్ల తల్లిదండ్రులు ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలని చదువుల విషయంలో గానీ, వ్యాపార విషయంలో కానీ మనం ఎంతగా ప్రోత్సహిస్తే అంతా అభివృద్ధి చెందుతారన్నారు. పిల్లల పెరుగుదల బాధ్యత తల్లికే ఎక్కువగా ఉంటుందని సీఈవో అన్నారు. కెనరా బ్యాంక్ టార్గెట్ మూడుకోట్ల అయినప్పటికీ ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా రుణాలను మహిళలకు ఇవ్వటం, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోటి రూపాయలు రుణం ఇవ్వటంను ఆమె కొనియాడారు. డి ఆర్ డి ఏ పి డి శిరీష మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించే విధంగా కెనరా బ్యాంక్ వారికి అండగా నిలుస్తూ రుణాలు ఇవ్వటం గర్వించదగ్గ విషయమే అన్నారు. కుటుంబం, ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడమే కాకుండా ప్రజల అభివృద్ధి కొరకు మహిళలు అన్ని రంగాల్లో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంకు ఏ ఈవో ఇంద్రజ అధ్యక్షత వహించగా గా డి ఆర్ డి ఏ పి డి జయశ్రీ, కెనరా బ్యాంక్ లీడ్ మేనేజర్ చంద్రశేఖర్, చీఫ్ మేనేజర్ వేణుగోపాల్ మేనేజర్ కె. ఎర్రయ్య, అర్ ఏ హెచ్ చీఫ్ మేనేజర్ నిరంజన్, బ్యాంక్ మేనేజర్ వసంత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *