TT Ads

మహిళలు కుటుంబాలకు చుక్కానిలా ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి ఎన్. ప్రతీప్ కుమార్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు రెండు పాత్రలు పోషిస్తున్నారని గృహిణి గా ఉంటూనే కూడా తాను చేస్తున్న ఏపనైనా దానికి న్యాయం చేస్తున్నారన్నారు. అటవీశాఖలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఓ వైపు ఉద్యోగ ధర్మం బాధ్యతగా నిర్వహిస్తూ మరోవైపు కుటుంబాన్ని కూడా మహిళలు సమర్థవంతంగా, చక్కగా చూసుకుంటున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి సీసీఎఫ్ (అడ్మిన్) శాంతి ప్రియా పాండే సంధానకర్త గా వ్యవహరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *