TT Ads

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

…ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి ఆవేదన వ్యక్తం చేశారు. 121వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగరంలో శుక్రవారం ఐద్వా వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల భారతి మాట్లాడుతూ మహిళలను వంటింటికి పరిమితం చేసే మనువాద సంస్కృతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ సంస్థలు మహిళలను సరుకుగా మార్చి పురుషుల అవసరాలను తీర్చే ఒక వస్తువులుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ఒక మనిషిగా మనుగడ సాగించాలంటే మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని అన్నారు. ప్రభుత్వాలు మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు మేరుగు రమణ, ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, అధ్యక్షురాలు తోట కృష్ణవేణి, తోట పద్మ, బత్తుల ప్రమీల, కోల్లి దుర్గా, ఉప్పెర్ల రాణి, మద్దినేని ఉషా, చావా కళావతి, తాటి కృష్ణకుమారి, బందెల అమృతమ్మ , మాదినేని రజిని, సునిత, లక్ష్మి, నారమ్మ, వెంకటరమణ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *