TT Ads

విజయవాడ సిపి కార్యాలయం:తప్పిన పెనుప్రమాదం,సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు.విజయవాడ GGHలో ఆక్సిజన్ తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ భాదితులు.18టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో తెగిపోయిన సంబంధాలు.విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు.హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసిన సి‌పి.ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని గుర్తించిన ప్రత్తిపాడు పోలీసులు.నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు.డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ప్రత్తిపాడు సిఐ అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు.డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి చేర్చిన పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *