TT Ads

అమరావతి:మణ్యం వీరుడు,భారత జాతి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 97 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భాజపా శ్రేణులు.పార్టీ కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు, పండరీ రాజు,సౌరభ్,కొండా సైదులు,శ్రీనివాస్ లు పాల్గొన్నారు.పాలూరి మాట్లాడుతూ తెల్ల దొరలకు కొరగాని కొయ్యగా మారి వారి మనదేశ సంస్కృతికి విఘాతం కలిగించే అన్ని కుట్రలను ఎండగట్టిన వీరుడు అల్లూరి బ్రిటీష్ చీఫ్ రూథర్ ఫర్డ్ కుట్రపూరితంగా వ్యవహరించి విప్లవకారులపై నిషేధం విధించి వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ ఊరి మునసబు ఇంటికి వెళ్లి తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పిన వ్యక్తి అల్లూరి అన్నారు. తరువాత,1924 మే 7న కొయ్యూరు అనే గ్రామ సమీపంలో ఒక ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి సీతారామరాజును బంధించి కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడన్నారు.అల్లూరి కి మరోపేరు అగ్గిరాజు .అల్లూరి సీతారామరాజు మనదేశ ప్రజల్లో చైతన్యం నింపిన మహానియుల్లో అల్లూరి కూడా మొదటి వ్యక్తుల్లో ఒకరని పాలూరి శ్రీనివాసరావు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *