TT Ads

ఎక్కడ చూసినా దాహం.దాహం.భానుడి దెబ్బకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం ‘అరణ్య’రోదన చేస్తున్నాయి. అడవుల్లో చెలిమలు, వాగులు, వంకలు ఎండిపోవడంతో దాహంతో అలమటిస్తున్నాయి. నీటి జాడ కోసం జనారణ్యంలోకి వస్తూ ప్రాణాలు విడుస్తున్నాయి. నల్లమల ఘాట్‌రోడ్లలో నేస్తం సేవా సంస్థ సభ్యులు ఏర్పాటు చేసిన మంచి నీటి తొట్టెలే వన్యప్రాణులకు శరణ్యంగా మారాయి. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా నేస్తం సేవా సంస్థ సభ్యులు కడప జిల్లా, మైదుకూరు – పోరుమామిళ్ల (ఎద్దడుగుఖనం), మిట్టమను పల్లె – బ్రహ్మంగారిమఠం నల్లమల అభయారణ్యంలో నందు వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో మంచి నీరు త్రాగడానికి వీలుగా తోట్లు, పక్షులు నీరు త్రాగడానికి వీలుగా కుండీలు, బేసులు, సుంకులను.. ఎర్పాటు చేసిన వాటి నిండ మంచి నీటిని నింపి.. క్యారెట్, దోసకాయలు, మామిడి కాయలు, టమోట పండ్లును వన్యప్రాణులకు ఆహారంగా అందించడం జరిగింది.

ఈ సందర్భంగా మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యుడు పి. బాలనాగి రెడ్డి మాట్లాడుతూ..
ఇంట్లో సేదతీరే మనుషులమే ఎండదెబ్బకి తట్టుకోలేకపోతున్నాము. ఎండలో బయట తిరిగే మూగజీవాలు, పక్షులు ఎలా బతుకుతున్నాయో ఏమో పాపం. పక్షులకు సరిపడా నీరు దొరకక ప్రాణాలనే వదిలేస్తున్నాయి. కాస్త చల్ల నీరు కనిపిస్తే మనం వంటిపైన పోసుకోవాలనిపిస్తుంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా నేస్తం సేవా సంస్థ సభ్యులందరం కలిసి 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి వన్యప్రాణులకు దాహం, ఆకలి తీరుస్తున్నాము. మీరు కూడ పక్షుల కోసం మీ ఇంటి దగ్గర గిన్నెల్లో నీళ్లు పోసి.. వాటికి అందుబాటులో ఉంచి, తినడానికి గింజలు వేయండి.. కొంత వరకైన ఈ వేసవిలో మన మిత్రులను కాపాడుకుందాం అన్నాడు.

ఈ కార్యక్రమంలో నేస్తం సేవా సంస్థ సభ్యులు.. RB.వెంకటరెడ్డి, యం. సురేంద్రకుమార్, పి. బాలనాగి రెడ్డి, ఐ. సతీష్ కుమార్, బి. రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నేస్తం సేవా సంస్థ సభ్యులు.. RB.వెంకటరెడ్డి, యం. సురేంద్రకుమార్, పి. బాలనాగి రెడ్డి, ఐ. సతీష్ కుమార్, బి. రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *