TT Ads

కడప జిల్లా కోడూరు పరిథిలో ఓబులవారిపల్లి లో అక్రమ రవాణా చేస్తున్న 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడం తో పాటు 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా ఆదేశాలు మేరకు టాస్క్ ఫోర్స్ డీఎస్పీలు గిరిధర్, మురళీధర్ ల ఆధ్వర్యంలో కోడూరు ఆర్ ఐ కృపానంద మరియు బృందం నిన్నటి దినం అనగా 15.04.2021 సాయంత్రం 05:00 గంటల నుండి ఓబులవారిపల్లి మండలం, బుడుగుంటపల్లి, కన్నెగుంట మరియు ఉర్లగట్టుపొడు, శివాజీ నగర్ ఏరియాలలో కూంబింగ్ చేస్తూ దారి మధ్యలో గవిగట్టు వద్దకు ఈ రోజు అనగా 16.04.2021 ఉదయం 05:00 గంటలకు చేరుకోగా , తొమ్మిది మంది స్మగ్లర్లు 9 ఎర్రచందనం దుంగలను మోసుకొని వెళ్లాడాన్ని గమనించాము. టాస్క్ ఫోర్స్ పోలీసుల రాకను గమంచిన స్మగ్గర్లు, ఎర్ర దుంగలను అక్కడే పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా, మేము వెంబడించి వారిని చుట్టుముట్టి పట్టుకోగలిగాము. వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుండి రూపాయలు 21,000/- స్వాధీన పరచుకున్నాము. పట్టుబడిన స్మగ్లర్లతో పాటు 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నాము. ఇంకా వారి వద్ద నుండి మూడు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం ఈ ప్రదేశంలో కూంబింగ్ కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పట్టుబడిన స్మగ్లర్ల పేర్లు.

  1. డేగల పెంచలయ్య
  2. వెలుగు మునెయ్య
  3. కనతల శివప్రసాద్
  4. పసుపులేటి శివకృష్ణ
  5. గురకల చంద్ర మౌలి
  6. పాముల హరి
  7. గిలకపాటి పోలయ్య
  8. తోమల మదు
  9. నచ్చుకూరి బాలు.
TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *