TT Ads

లండన్: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో భారత్‌కు సాయం చేసేందుకు లండన్ ముందుకొచ్చింది. 600కు పైగా ఆక్సిజన్‌ కాన్సెట్రేటర్లు, వెంటీలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలు పంపింది. ఇంగ్లండ్‌‌లోని బకింగమ్‌షైర్ మిల్టన్ కీన్స్ నుంచి భారత్‌కు తరలించారు. మంగళవారం నాటికి ఢిల్లీకి చేరుకుంటాయి. మరోవైపు కోవిడ్‌పై పోరులో భారత్‌కు అండగా ఉంటామని ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత్ తమకు మిత్రదేశమన్నారు.  

మరోవైపు సింగపూర్ కూడా 600కు పైగా ఆక్సిజన్‌ కాన్సెట్రేటర్లు, వెంటీలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలను భారత్‌కు పంపింది. చాంగి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా విమానం ద్వారా వీటిని భారత్‌కు తరలించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *