TT Ads

భక్తి విశ్వాసలకు ప్రతీక రంజాన్ పండగ అని మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.ముస్లిం సోదరులు అతి పవిత్రంగా జరుపుకునే పండగా రంజాన్ మాసం సందర్భంగా ప‌శ్చిమ‌ నియెజ‌కవ‌ర్గం భ‌వానీపురం ష‌హ‌బ్ ద‌ర్గ నందు ముస్లింలకు రంజాన్‌ తోఫా మంత్రి వెలంప‌ల్లి పంపిణి చేశారు.రంజాన్‌ నెల సందర్భంగా ఎ.కె ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 8 రకాల సరుకులతో రంజాన్‌ తోఫా శ‌నివారం మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస‌రావు పంపిణి చేశారు.కరోనా కష్టకాలంలో రంజాన్‌ పండుగను పేదల ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో దాతల సహకారంతో రంజాన్‌ తోఫా అందజేసినట్లు మంత్రి తెలిపారు.కార్యక్రమంలో నిర్వ‌హ‌కులు అబ్దుల్ స‌త్తార్‌, అబ్దుల్ క‌లిమ్‌, అబ్దుల్ ర‌హ‌మ‌న్‌, 41వ డివిజ‌న్ వైసీపీ నాయ‌కులు స్థానిక కార్పొరేట‌ర్‌ మొహమ్మ‌ద్ ఇర్పాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *