TT Ads

రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ గారి తండ్రి, వైరా మండల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బొర్రా వెంకటేశ్వర్లు గారు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని గురువారం ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరామర్శించారు. మృతి చెందిన బొర్రా వెంకటేశ్వర్లు గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్దించారు. తండ్రి మరణంతో బాధ పడుతున్న బొర్రా రాజశేఖర్ గారిని ఓదార్చి, మనోధైర్యం కల్పించారు.ఇటీవల మృతి చెందిన వైరా మండలం గరికపాడు గ్రామంకు చెందిన మాజీ సర్పంచ్ శీలం కరుణాకర్ రెడ్డి గారి దంపతుల కుటుంబాన్నిగురువారం ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పరామర్శించారు. మృతి చెందిన కరుణాకర్ రెడ్డి గారు వారి భార్య చిత్రపటాలకు పూలమాల వేసి నివాళ్లు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మాజీ ఎంపీ పొంగులేటి వెంట వైరా మునిసిపాలిటీ చైర్మన్ సూతగాని జైపాల్ గారు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు దార్న శేఖర్ గారు ఉన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *