TT Ads

స్థానిక వైరా మున్సిపాలిటీ పరిధిలో నిత్యం రద్దిగా ఉంటే వాసవి థియేటర్ రోడ్, ఠాగూర్ కాలేజ్లో రోడ్ లో సైడ్ కాలువలు తీయక నెలలు గడుస్తున్న తీయడం లేదు.సైడ్ కాలువలు తీయకపోవడం వలన ఆ మట్టిలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయి.

సైడ్ కాలువలలో మట్టి పేరుకొని పోయి ఎక్కడి మురుగు నీరు అక్కడే నిల్వ ఉండటం వలన ఆ గుంటలలో దోమలు ఈగలు చేరుతున్నవి. నీరు నిల్వ ఉండటం వలన దుర్గంధం వెదజల్లుతుoది.

ఈ రోడ్ ని కనీసం 15 రోజులకు ఒకసారి అయినా కాలువలు తీపించే ఏర్పాటు చేయగలరు అని ప్రజలు కోరుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కాలువలను శుభ్రం చేపించి, సిమెంట్ రోడ్ పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి తగు చర్యలు తీసుకోగలరు.వెంటనే స్పందించగలరు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *