TT Ads

బిజెపి సీనియర్ నాయకులు కూర్మా రావు గారి మరణ వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని శ్రీ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సబ్యులకు తెలిపారు. ఈ కరోనా మహమ్మారి వారిని ఇంత త్వరగా బలి తీసుకుంటుందని ఊహించలేదని, నిక్కచ్చయినటువంటి, గట్టి పట్టుదల గల నాయకులు శ్రీ కూర్మా రావు గారని గుర్తుచేసుకున్నారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అలాగే అనేక పదవులను అలంకరించి ఉన్నతమైన సేవలందించారని, ఇతరులకు సహాయం ఎలా చేయాలనే ఆలోచన ఉన్న ఉదారవాది శ్రీ కూర్మా రావు గారు అని, తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించకుండా ఇతరులకు సేవ చేయడానికి సదా ముందుండే వ్యక్తి అని శ్రీ దత్తాత్రేయ గారు కొనియాడారు. వారితో మరియు వారి కుటుంబ సభ్యులతో తనకు సుమారు 30 సంవత్సరాలకు పైగా సన్నిహిత అనుబంధం ఉందని, తనకు అత్యంత ఆత్మీయుడు అని గుర్తుచేసుకున్నారు. శ్రీ కూర్మా రావు గారు ఆప్యాయత గల వ్యక్తి అని, అనేకమైన వ్యక్తులతో, పలు సంఘాలతో మంచి పరిచయం ఉన్న నాయకుడు అని పేర్కొన్నారు.

శ్రీ కూర్మా రావు గారు భారతీయ జనతా పార్టీకి, జాతీయ భావాలకి అంకితభావంతో పని చేశారని, విజయవాడలో భారతీయ జనతా పార్టీకి మూల స్థంభాలలో ఒకరైన శ్రీ కూర్మా రావు గారి మరణం విజయవాడ పట్టణానికి తీరని లోటు అని, వారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నట్లు శ్రీ దత్తాత్రేయ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దివంగత కూర్మా రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు శ్రీ బండారు దత్తాత్రేయ గారు తెలియజేసారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *