TT Ads

ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు బలపర్చిన సీనియర్ జర్నలిస్టు బి.జయసారధి. రెడ్డి కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఐద్వా ఖమ్మం జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, ఏఐటీయూసీ మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్ధించారు. శుక్రవారం నగరం 24వ డివిజన్ శ్రీకృష్ణ నగర్ ఏరియాలో ఎమ్మెల్సీ అభ్యర్థి బి. జయసారధి రెడ్డి విజ
యాన్ని కాంక్షిస్తూ, వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా
లు అన్ని రంగాల ప్రజలు, ఉద్యోగులు, ఉపా
ధ్యాయులు, కార్మిక వర్గాల వారిని విస్మరించా
నడంలో అతిశయోక్తి లేదని అన్నారు. ప్రజ
లకు, ద్యోగులకు, ఉపాధ్యక్షులకు, అసంఘ
టిత రంగాల కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు.
అటువంటి పార్టీలు ఇప్పుడు జరగనున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు, పౌర సమాజాం అంతా గమనిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో నిలబడ్డ అభ్యర్థులలో ప్రభుత్వాన్ని నిలదీచే శక్తి సామర్థ్యాలు కలిగిన గొంతుకయిన సీనియర్ జర్నలిస్టు బి. జయసారధి రెడ్డి దేనని, జయసారధి రెడ్డిని గెలిపించడం వల్ల ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మి
కులు, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతా
రని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకకు గ్రాడ్యుయేట్ ఓటర్లు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యురాలు అమరావతి, సత్తెనపల్లి శ్రీను, తమ్మినేని బుచ్చయ్య, సిఐటియు జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, సిపిఐ నాయకులు నాయకులు వెంకటేశ్వర్లు, బ్రహ్మం, రామారావు, విరభద్రం తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *