TT Ads

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్త‌పేట‌కు చెందిన వడడ రేయాన్ష్ కాలేయ సంబంధిత వ్యాధి చికిత్స నిమిత్తం సిఎం సహాయ నిధి నుంచి ( LOC) 18,00,000 అందించిన్న‌ట్లు దేవ‌దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. గురువారం బ్ర‌హ్మాణ‌వీధి మంత్రి వెలంపల్లి నివాసంలో మంత్రి బాధితునికి ఎల్‌వోసీ అందించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు తన పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యం తో ఆరోగ్య శ్రీ ని ప్రవేశ పెట్టారన్నారు.ఆనంతరం టిడిపి పాలన లో పేదలకు వైద్యం అందని ద్రాక్షా గా మారిందన్నారు .నేడు జగనన్న ప్రభుత్వము అందరికీ అభివృద్ది, సంక్షేమం అందించాలనే లక్ష్యంతో పని చేస్తుందన్నారు. జగనన్న ప్రభుత్వం లో తెల్లకార్డుతో సంబందం లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *