TT Ads

తెలుగు జాతికి నవయుగ వైతాళికుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చరిత్రలో నిలిచిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్బంగా శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించారు. స్త్రీ బయటకు వెళ్లి చదువుకోలేని రోజుల్లోనే బాలికా పాఠశాల ప్రారంభించారు. పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు అందిస్తూ చదువుల్లో రాణించేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహించేవారు. మూడనమ్మకాలను పారద్రోలారు. మహిళోద్దరణకు కందుకూరి విశేషంగా కృషిచేశారు. ఆయన సతీమణి కందుకూరి రాజ్యలక్ష్మి అందించిన తోడ్పాటుతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. వితంతు వివాహాలు జరిపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. దాదాపు 130కి పైగా గ్రంథాలు రాశారు. తెలుగులో ఇంత పెద్ద సంఖ్యలో గ్రంథ రచనలు చేసినవారు మరొకరు లేరంటే ఆశ్చర్యమే. సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేశారో, సాహిత్యంలోనూ సమాంతర కృషి చేశారు. యావత్ తెలుగుజాతి ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటోంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *