TT Ads

ఖమ్మం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి .ఆర్.అంబేద్కర్ 130వ జయంతిని పురసకరించుకుని పులే చౌక్ లో బుధవారం బహుజన జె ఏ సీ , ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వించారు . బహుజన జె ఏ సీ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో తొలుత డా ” అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ముఖ్య అతిదులుగా ప్రముఖ సామాజిక వేత్త హర్షిని డవల పర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వర్లు , మహిళ పోలీస్ స్టేషన్ సి. ఐ. సర్వయ్య , జిల్లా గ్రంధలయ ఛైర్మన్ ఎమ్ డి. ఖామర్ ప్రసంగిస్తూ దేశం కోసం , సమాజం కోసం , బడుగు బలహీనర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనయాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాధికార దిశగా ప్రయాణం కొనసాగిస్తామని అల్లిక వెంకటేశ్వర్లు తెలిపారు .

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన హక్కులతో తాను ప్రభుత్వ ఉద్యోగి అయినానని సి. ఐ. సర్వయ్యా అన్నారు .బహుజన జె ఏ సీ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ , పూలే ఆశయాల సాధనకు బహుజన జె ఏ సీ తెలంగాణ ను అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు . బహుజనుల అభివృద్ధి , అభ్యున్నతి తో పాటు బహుజన రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రమం లో వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు , ఎల్ హెచ్. పి ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్ర చౌహాన్ , జంగిపల్లి రవి, జి.వీరభద్రమ్ , ఎల్.హెచ్.పి ఎస్.ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. దాశరథ నాయక్ , నాగార్జున, రమాదేవి , ఎస్.కె.నాజీమ , రవి , తెలంగాణ శ్రీను , జాని , ఎన్.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *