TT Ads

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ , ఎస్టీ , బిసి , మైనారిటీ , ఈ బిసి సంఘాలను ఐక్యం చేస్తూ బహుజన రాజ్యాధికార సాధన కోసం బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఆవిర్భవించడం జరిగిందని , ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు . ఈ కమిటీకి వైస్ చైర్మన్ గా బానోత్ బద్రునాయక్ ఖమ్మం జిల్లా కమిటీ కి ముఖ్య సలహాదారులు గా గుంతేటి వీరభద్రం , డాక్టర్ కె వి కృష్ణారావు , రవిచంద్ర చౌహాన్ వ్యవహరిస్తారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో బహుజన జేఏసీ ముఖ్యనాయకులు గా అబ్దుల్ రెహమాన్ , రవీంద్ర నాయక్ , ఐతే ఉపేందర్ , మధు , అనార్కలి , అఖిల్ , నాగార్జున తదితరులు వ్యవహరించడం ఉన్నట్లు ప్రకటించారు. బహుజన జాయింట్ ఆక్షన్ రాష్ట్ర కమిటీ డిసెంబర్ 2వ తేదీన 2020లో ఏర్పడిందని దీన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ 190/ 2020 తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ బత్తుల శ్రీనివాస యాదవ్ వెల్లడించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *