TT Ads

బడ్జెట్​ నిధుల కేటాయింపులో వైద్య ఆరోగ్య రంగం.. ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోందని పార్లమెంటరీ స్థాయీసంఘం ఒకటి ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, మానవ వనరుల కొరత వేధిస్తోందని వెల్లడించింది. జాతీయ వైద్య విధానాన్ని రాష్ట్రాలు లెక్క చేయటం లేదని తెలిపింది. ఇటీవల పార్లమెంటుకు స్థాయీసంఘం సమర్పించిన ఆ నివేదిక.. ప్రస్తుత కొవిడ్​ సంక్షోభ సమయంలో చర్చనీయాంశంగా మారింది.

దేశంలో వైద్య ఆరోగ్య రంగం ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని పార్లమెంటరీ స్థాయీసంఘం ఒకటి ఆవేదన వ్యక్తం చేసింది. నిధుల కేటాయింపులో ఆ శాఖకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొంది. ఫలితంగా ఆస్పత్రుల్లో మానవ వనరులు, మౌలిక వసతుల కొరత తీవ్రమవుతోందని తెలిపింది. ఇటీవల పార్లమెంటుకు స్థాయీసంఘం సమర్పించిన ఆ నివేదిక.. తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రజలు కొవిడ్ ధాటికి అల్లాడుతున్న ప్రస్తుత సమయంలో చర్చనీయాంశంగా మారింది.

నివేదికలోని ముఖ్యాంశాలివి..
కేంద్ర బడ్జెట్​లో వైద్యరంగానికి దాదాపుగా ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. కేటాయింపులు అరకొరగానే ఉంటున్నాయి. 2021-22 బడ్జెట్​లో తమకు రూ.1,21,889 కోట్లు కేటాయించాలని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ కోరితే.. ఆర్థిక మంత్రి కేవలం రూ.71,268 కోట్లు (కోరిన మొత్తంలో 58%) కేటాయించారు. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో సముచిత ప్రాధాన్యమిచ్చే దేశాల జాబితాలో.. 189 దేశాలకు గాను భారత్ 179వ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో)లు ఇటీవల ప్రకటించాయి. 2018 నాటి లెక్కల ప్రకారం స్వీడన్, జపాన్ వంటి దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 9 శాతానికి పైగా నిధులను వైద్య ఆరోగ్య రంగంలో ఖర్చు చేస్తున్నాయి. మాల్దీవులు, అర్జెంటీనా, కొలంబియా తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలూ 5-7% వ్యయం చేస్తున్నాయి. భారత్ (1.4%) వాటి దరిదాపుల్లో కూడా లేదు.

వివిధ దేశాల్లో వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వ, ప్రైవైటు వ్యయం(శాతాల్లో)

రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యమే.రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ బడ్జెట్​లలో 8% నిధులను వైద్య రంగానికి ఖర్చు చేయాలని జాతీయ వైద్య విధానం సూచిస్తోంది. 2018-19 లెక్కల ప్రకారం.. మేఘాలయ(9.1%), దిల్లీ(13.7%), పుదుచ్చేరి(8.6%)ల్లో మినహా మరెక్కడా ఆ సూచన అమలుకు నోచుకోలేదు. చాలా రాష్ట్రాలు వైద్య రంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇకముందైనా కేటాయింపులు పెరగాలి.

నిరు పేదలకే దెబ్బనిధుల లేమి వైద్య వ్యవస్థ పాలిట విపత్తుగా పరిణమిస్తోంది. దానివల్ల నిరు పేదలు, అణగారిన వర్గాలకే ఎక్కువ దెబ్బ. వైద్యం కోసం ప్రజలు సొంత జేబుల నుంచి పెట్టుకునే ఖర్చును తగ్గించాలి. ప్రజల ఆర్థిక, సామాజిక అభ్యున్నతిని ప్రోత్సహించాలి.

జీడీపీలో వైద్య ఆరోగ్య రంగంపై వ్యయం

కేంద్ర బడ్జెట్​లో వైద్య ఆరోగ్య శాఖకు కేటాయింపులు

లోపాల్ని బహిర్గతం చేసిన కొవిడ్వైద్యరంగానికి తక్షణం భారీయెత్తున పెట్టుబడులు అవసరం. దేశ వైద్య ఆరోగ్య రంగంలోని లోపాలను కొవిడ్ మహమ్మారి బట్టబయలు చేసింది. ఇకనైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. ప్రజలకు సులభంగా, అందుబాటు ధరల్లో వైద్యం అందించాలి. అకస్మాత్తుగా ఎదురయ్యే వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లోనూ వారికి ఆర్థిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అందుకోసం ప్రజారోగ్య మౌలిక వసతులు, మానవ వనరులను భారీగా పెంచాలి.ఇదీ చూడండి: ‘ధరలు అదుపులో ఉంచేందుకే వాటిపై జీఎస్టీ’
ప్రభుత్వ వ్యయం పెరగాలివచ్చే రెండేళ్లు జీడీపీలో కనీసం 2.5% మొత్తాన్ని వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. 2025 నాటికి మొత్తాన్ని 5%కి పెంచాలి. ప్రస్తుతం దేశంలో వైద్యరంగంపై జరుగుతున్న ఖర్చులో 27% మాత్రమే ప్రభుత్వ వ్యయం ఉంది. వైద్యరంగంలో ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో 196 దేశాలకుగాను 158వ స్థానంలో భారత్ ఉంది. 2021-22 నుంచి 2025-26 మధ్య అయిదేళ్ల కాలానికి రూ.5.97 లక్షల కోట్ల గ్రాంటు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘాన్ని కేంద్ర, వైద్య ఆరోగ్య విభాగం కోరింది. కానీ కేటాయించింది మాత్రం కేవలం రూ.1.06 లక్షల కోట్లు. కోరిన మొత్తంలో అది 10.3 శాతం మాత్రమే. అందులో 2021-22కి రూ. 13,192 కోట్లు మాత్రమే కేటాయించారు.

“విపత్తులు ముందే చెప్పి రావు. అవి వచ్చినప్పుడు మొదట బలయ్యేది వైద్యరంగమే. వాటిని సమర్థంగా ఎదుర్కొనేలా వైద్యరంగాన్ని బలోపేతం చేయడం ఇప్పుడు అత్యవసరం. వైపరీత్యాలు ముంచుకొస్తే అత్యుత్తమ రీతిలో స్పందించడానికి అవసరమైన మానవ వనరులను ముందుగానే సమకూర్చుకోవాలి. రసాయనిక, జీవ సంబంధ, రేడియోధార్మిక, అణు (సీబీఆర్ఎన్) విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సామర్థ్యాలను సముపార్జించుకోవాలి. ఇందుకోసం సీబీఆర్ఎన్ వైద్య నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి. ఆధునిక అవసరాలకు తగ్గట్టు మానవ వనరులను సమాయత్తం చేసేందుకు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కోసం తక్షణం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ కోర్స్ అమలు చేయాలి. అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆదేశించాలి”

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *