TT Ads

కరోనా వైరస్ బాధితుల నుండి ప్రైవేటు వైద్యశాలలు దోపిడి చేయకుండా ముందస్తు జాగ్రత్తగా టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సామాజికవేత్త చల్ల రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక గా ఓ తనిఖీ బృందం నీ నియమించాలన్నారు. కొన్ని కొన్ని ప్రైవేటు వైద్యశాలలో పేషంట్ల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. పేషెంటుకు ప్రాణాపాయం లేకుండా ఆక్సిజన్, మందులను కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని ఆయన కొనియాడారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *