TT Ads

లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఇచ్చామని, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని, ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ, ఎడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా భారత్ ను నిరుద్యోగ దేశంగా మార్చిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వానికి మార్చి 14 నా జరిగే శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తగిన గుణపాఠం చెప్పక తప్పదని సిపిఐ, సిపిఎం పార్టీల ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ఐద్వా ఖమ్మం జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి హెచ్చరించారు. ఆదివారం సిపిఐ, సిపిఎం పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో వి.డి.ఓ.ఎస్ కాలనీల్లో గల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి ఓట్లు ఆభ్యర్ధిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పౌర సమాజాన్ని టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఎంతకాలం మోసం చేస్తూ అబద్ధపు హమీలతో పరిపాలన కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ లో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగి పోతుందని కేసిఆర్ ప్రభుత్వం ఎక్కడా ఉద్యోగాలు భర్తి చేయలేదని, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందన్నారు, మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్ సంస్థలకు ఉద్యోగులను, కార్మికులను కట్టు బానిసలుగా మార్చేసిందని యద్దేవా చేశారు. ఇటువంటి పార్టీలు ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గాల శాసన మండలి ఎన్నికల్లో ఏమొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఇటువంటి వారికి ఓట్లేసి మరోసారి తప్పు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గ సమస్యలపై శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకయిన వామపక్షాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి బి. జయసారధి రెడ్డి కే మీ ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ధన బలంతో,అదికార బలం మాకు ఉందని ఓటర్లు మా వైపు ఉన్నారని బ్రమల్లో ఉన్నారని గ్రాడ్యుయేట్ ఓటర్లకి బిజేపి, టిఆర్ఎస్ పార్టీల పరిపాలనలో తామేంత మోసపోయానేమో ఇప్పుడర్ధమవుతుందని ఎన్నికలప్పుడు మాత్రం ఇంటింటికీ తిరిగి అధికార పార్టీలను చూసి అసహ్యించు కుంటునారని స్వయంగా ఓటర్ల నోటితో వారే అంటున్నారనడంలో అతిశయోక్తి లేదని తెలిపారు. అందుకే వామపక్షాలు బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి సీనియర్ జర్నలిస్టు బి. జయసారధి రెడ్డి కే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసన మండలికి జయసారధి రెడ్డి ని పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఖమ్మం జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, సిపిఎం హవేలి శాఖ కార్యదర్శి అమరావతి, సిపిఎం ద్వారకా నగర్ శాఖ కార్యదర్శి టి. భుచ్చయ్య, బి. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *