TT Ads

తిరుపతి రూరల్ మండలం మూడో కార్యాలయంలో జర్నలిస్టులకు నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి గారు,ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు, మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.

మెరుగైన సమాజం కోసం పనిచేస్తున్న జిల్లాలోని జర్నలిస్టులకు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉంటేనే ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తారు.

మీడియా మిత్రులు కరోనా బారిన పడకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామం.

వందల సంఖ్యలో మీడియా ప్రతినిధులు, మిత్రులు స్పందించి వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు.

జర్నలిస్టులు వ్యాక్సినేషన్ చేసుకోవడం ద్వారా సురక్షితంగా ఉండటంతో పాటు సమాజంలో వ్యాక్సిన్ పట్ల ఉన్న అపోహలు తొలగించడంలో సందేశం ఇచ్చినట్లు అవుతుందన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి కృపతో జర్నలిస్టులు ఏ ఒక్కరూ కరోనా భారిన పడకుండా ఉండాలని ఆకాంక్షించారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి,ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు కరోనా సమయంలో చేసిన సేవలు ఆదర్శనీయం: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ప్రతి జర్నలిస్టు తప్పక వ్యాక్సినేషనల్ వేయించుకోవాలని చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *