TT Ads

పొలింగ్ కేంద్రాలలో పర్యాటించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఖమ్మం టౌన్ ,ఖమ్మం రూరల్ ,వైరా ,కల్లూరు డివిజన్ లోని పలు పొలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోని శాంతినగర్ స్కూల్, సెయింట్ జోసెఫ్ స్కూల్, SR&BGNR కాలేజ్ , ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడుపేట ,
జలగం నగర్,ముదిగొండ ,
నేలకొండపల్లి ,వైరా డివిజన్ చింతకాని ,వైరా, కొణిజర్ల , తల్లాడ ,కల్లూరు ,సత్తుపల్లి పొలింగ్ కేంద్రాలలో పర్యాటించారు.పొలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా లేకుండా పోలీస్ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా స్ధానికులతో మాట్లాడుతూ ..శాంతియుత వాతావరణంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణకు ప్రతి ఓక్కరూ సహకరించాలని సూచించారు. ఎన్నికలలో అనవసరంగా అల్లర్లు సృష్టించడం, గొడవలు
పడటం వల్ల కేసుల్లో ఇర్కొని కేసులు ,కోర్టులు తిరుగుతూ ఆర్ధికంగా, కుటుంబపరంగా భవిష్యత్ పాడు చేసుకొవద్దని సూచించారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛ పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఏలాంటి ఆపోహలకు తావు లేకుండా పకడ్భందిగా జరుగుతున్నాయని తెలిపారు.

పోలీస్ కమిషనర్ తో పాటు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ మురళీధర్, అడిషనల్ డీసీపీ
ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ( AR)కుమారస్వామి ,
ఏఎస్పీ స్నేహ మెహ్రా టౌన్ ఏసీపీ అంజనేయులు,
ఖమ్మం రూరల్ ఏసిపి వెంకటరెడ్డి , వైరా ఏసీపీ సత్యనారాయణ,కల్లూరు ఏసీపీ వేంకటేశ్ ,CCS ACP జహాంగీర్ పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *