TT Ads

అమరావతి: తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోలింగ్‌ రద్దు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నిక నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘తిరుపతిలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. స్థానికేతరులు వేలసంఖ్యలో దొంగ ఓట్లు వేశారు. దొంగ ఓట్ల నియంత్రణలో పోలీసులు, అధికారులు విఫలమయ్యారు. స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి’’ అని సీఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే వీడియో, ఫొటో ఆధారాలను సీఈసీ లేఖకు జత చేసి పంపారు. ఇదిలా ఉంటే.. తిరుపతి లోక్‌సభ పరిధిలో మధ్యాహ్నం 3గంటల వరకు 47.42% పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *