TT Ads

విజయవాడ:తిరుపతి ప్రచార సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు ఆయన మాటలతో వైసిపి నేతల్లో భయం పట్టుకుంది మంత్రులు గుంపులుగా వచ్చి నోళ్లు పారేసుకుంటున్నారు సొంత బాబాయి హత్య కేసు నిందితులను పట్టుకోలేని అసమర్థ సిఎం జగన్మోహన్ రెడ్డి చిడతల నాని నాయుడు జగన్మోహన్ రెడ్డి నవ్వుకునేలా చిడతలు కొడుతున్నాడు స్క్రిప్ట్ లు ఎవరు ఇస్తే ఏం మాట్లాడతారో చిడతల నాయుడు చరిత్ర అందరకి తెలుసు చిడతల నాయుడు ఎప్పుడు అయినా కాపుల సమస్యలు పై స్పందించారా అగ్రవర్ణాలలో పేదలకు ఇబిసి రిజర్వేషన్ పై దమ్ముంటే మాట్లాడు వంగవీటి మోహనరంగా తనయుడు రాధాకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించలేదు ఓట్ల కోసం రంగా ఫొటోలు పెట్టుకుని మాత్రం నటిస్తారు ప్రత్యేక హోదా తెస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలికింది వాస్తవం కాదా 22మంది ఎంపీలను ఇస్తే పార్లమెంటు లో మౌన వ్రతం పాటిస్తున్నారు ఎవరైనా మాట్లాడితే.ఎంపి రఘురామకృష్ణ రాజు తరహాలో గెంటేస్తారు సోదరి షర్మిలతో జగన్మోహన్ రెడ్డి గొడవ పెట్టుకున్నారు ఆస్తులు కూడా పంచి ఆమెను తెలంగాణ కు పంపించారు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే భార్య భారతిగారిని సిఎం చేయడానికి స్కెచ్ రెడీ అయ్యింది దీని పై కూడా మంత్రులు స్పందింస్తే బాగుంటుంది రమణ దీక్షితులు తో పింక్ డైమండ్, రాజకీయం మాట్లాడించింది ఎవరు ఇప్పుడు పింక్ డైమండ్ కోసం రమణ దీక్షితులు ఎందుకు మాట్లాడటం లేదు దేవాలయాల కబ్జాల మంత్రి ని తిరుపతి ఉప ఎన్నికల ప్రచార జాబితాలో చేర్చలేదు వెల్లంపల్లి ప్రచారం చేస్తే ఓటమి ఖాయమనే వైసిపి అధిష్టానం భావించిందిహిందూ దేవుళ్ళను వాడుకుని.వైసిపి విద్వేషాలను రెచ్చ గొడుతుంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *