TT Ads

పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, నిరుపేదలకు టీఆర్ఎస్ప్ర భుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.ఆపదలో పేదలకు సీఎం రిలీఫ్ వరం లాంటిదని మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ 2 వ వార్డు లో కె.బాలరాజు అనారోగ్యం కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు కౌన్సిలర్ నాగాయపల్లి సుజాత శ్రీనివాస్ సహకారంతో దరఖాస్తు చేసుకోగా 40,000/ రూపాయల మంజూరు అయిన చెక్కును మంత్రి చామకూర మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, తెరాస అధ్యక్షులు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్ నాను నాయక్ , కౌన్సిలర్ శ్రీహరిగౌడ్, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్ సీనియర నాయకులు TRS శ్రీనివాస్,రెండో వార్డు అధ్యక్షులు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *