TT Ads

పుంగ‌నూరు వీర‌ప్ప‌న్ పెద్దిరెడ్డి.ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేస్తున్న‌ట్టే! ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి బ‌య‌టి నుంచి త‌న ముఠాల‌ను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు. పెద్దిరెడ్డి మ‌నుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పిఎల్ఆర్‌ క‌ళ్యాణ‌మండపంలో మ‌కాం వేసి దొంగ ఓట్లు వేయ‌డానికి వెళ్తుంటే టిడిపి నాయ‌కులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పోలీసులు..అధికార యంత్రాంగంతో ఎల‌క్ష‌న్ జ‌ర‌గ‌కుండా సెల‌క్ష‌న్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి..కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ని అక్ర‌మార్గంలో గెల‌వాల‌ని నేరుగా తానే రంగంలోకి దిగారు. తిరుప‌తి ఉప‌ఎన్నిక‌లో రిగ్గింగ్‌, దొంగ ఓట్ల‌తో నెగ్గాల‌ని వేసిన ప్ర‌ణాళిక‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇప్ప‌టికైనా కేంద్ర ఎన్నిక‌‌ల క‌మిష‌న్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర ప్రాంతాల త‌ర‌లివ‌చ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్ర‌ధారులపై చ‌ర్య‌లు తీసుకోవాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *