TT Ads

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పిల్లల సంరక్షణ సంస్థల(సీసీఐ)కు అవసరమైన సాయాన్ని అందించటానికి హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు మహిళా-శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ తెలిపారు. 040-23733665 ల్యాండ్‌లైన్‌ నంబర్‌ ఉదయం 9 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పని దినాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. పిల్లల సంరక్షణ సంస్థలకు ముందు జాగ్రత్త చర్యలు, సూచనలు చేయడానికి ఈ హెల్ప్‌లైన్‌ నంబరు తీసుకొచ్చినట్లు కమిషనర్‌ వివరించారు. తమ నిర్ణయం క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీచేయటానికి, పిల్లలను వైరస్‌ వ్యాప్తి నుంచి కాపాడటానికి సహాయ పడుతుందని చెప్పారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *