TT Ads

మార్చి 30 ఖమ్మం: మున్సిపల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బంది భవిష్య నిధి లో ఏప్రిల్ నెల నుండి ఆధార్, పిఎఫ్ ఖాతాల్లో ఒకేలా పుట్టిన తేదీ లేకుంటే సొమ్ము చెల్లింపులు జరగవు అనడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వం అటువంటి ఆలోచన విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటియుసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

మంగళవారం ఏఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ మాధవ శంఖర్ కు వినతి పత్రం సమర్పించారు అనంతరం మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసలే చదువు రాని నిరక్ష్యరాసులు మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో చాలిచాలని జీతాలతో వెట్టిచా కిరితో పనిచేస్తున్నారని వారి పేర్లు పిఎఫ్ ఖాతాల్లో నమోదు చేసేటప్పుడు మున్సిపల్ సిబ్బంది కార్మికుల వయస్సును ఎగ్జాంపుల్ గా పుట్టిన తేదీ వివరాలు పొందుపరిచారు.

కార్మికులు పిఎఫ్ ఖాతాల్లో చేరేటప్పుడు ఆధార్ వ్యవస్థ లేదు కార్మికులకు పిఎఫ్ వ్యవస్థ 2011 నుండి అమల్లోకి వచ్చింది. కానీ ఆధార్ విధానం 2015 వ సంవత్సరంలో వచ్చింది అప్పుడు కార్మిక సిబ్బందికి తెలిదు ఆధార్ నమోదు చేసేటప్పుడు పిఎఫ్ ఖాతాల్లో ఉన్న విధంగా పుట్టిన తేదీ వివరాలు ఒకేలా ఉండాలని తెలియక ఆధార్ లో అంచనాగా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయించుకున్నారు

అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు విధించి మున్సిపల్ ఉద్యోగ కార్మిక సిబ్బంది భవిష్యత్తులో జీవితానికి ఆసరాగా ఉంటుందని భవిష్యనిధి పిఎఫ్ లో కొంత సోమ్ము జమచేసుకోవడం వాటికి తోడు పనిచేస్తున్న కార్యాలయం వాట కింది కొంత సోమ్ము జమచేయడం జరుగుతుందని అటువంటి సోమ్ముకు భవిష్యనిధిలో కట్టేటప్పుడు ఎటువంటి నిబంధనలు లెవని ఇప్పుడు మాత్రం సవాలక్ష కారణాలు ఆధారాలు అడిగితే ఇప్పుడు కార్మికులు లేని ఆధారాలు ఎక్కడినుండి తెస్తారని ప్రశ్నించారు.బి.పాపారావు,కె.తిరపయ్య, జి.శ్రీనివాస్,సిహెచ్ తిరపయ్య తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *