TT Ads

క్షిణాది సినీ నటి, కోట్లాది మంది అభిమాన తార షకీలా  (47) రాజకీయ ప్రవేశం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో ఆమె పని చేయనున్నారు. షకీలా పూర్తి పేరు ‘షకీలా బేగం’. ఆమె స్వస్థలం తమిళనాడులోని కొడంబక్కమ్. షకీలా తల్లి చాన్ బేగం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు.

మాలీవుడ్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన షకీలా దక్షిణాది భాషల్లో వందల సినిమాల్లో నటించారు. ఒకప్పుడు మలయాళంలో అగ్ర హీరోలకు పోటీగా ఆమె సినిమాలు విడుదలయ్యేవి. షకీలా దాటికి అగ్ర హీరోల సినిమాలు కూడా వెనుకబడిపోయేవి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో షకీలా నటించారు. 200కి పైగా సినిమాలు చేశారు. శృంగార తారగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సంపాదించుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *