TT Ads

జాతీయ ఉద్యమ పితామహుల్లో ఒకరైనా సీనియర్ పాత్రికేయులు… ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు కోసూరి అమరనాథ్ గారు ఆకస్మికంగా మరణం పట్ల తీవ్ర సంతాపం దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు.జర్నలిస్ట్లు కు కొండంత అండగా ఉంటూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో చర్చించి జర్నలిస్ట్ల సమస్యలు పరిష్కారంకు కృషి చేసిన అమరనాథ్ గారు మరణం నన్ను ఎంతగానో బాధించింది.

పశ్చిమగోదావరి జిల్లా బీమవరం సమీపంలో పెన్నాడ గ్రామంలో జన్మించి జర్నలిస్ట్ గా ప్రవేశం చేసి నేడు జాతీయ స్థాయిలో ఉన్నత స్థితికి ఎదిగిన సీనియర్ జర్నలిస్ట్ అమరనాథ్ గారు మరణం జర్నలిస్ట్ లోకానికి కాకుండా వ్యక్తిగతంగా మాకు తీరని లోటు వర్కింగ్ జర్నలిస్ట్స్ కోసం నిరంతరం పోరాటం సాగించిన ఒక మంచి మార్గదర్శి అమరనాథ్ గారిని కోల్పోవడం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ లకు తీరని లోటు,ఒక కుటుంబ సభ్యుడును కోల్పోయినట్టు తాను భావిస్తున్నాను.అమరనాథ్ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.తుది శ్వాస వరకు జర్నలిస్ట్లు సమస్యలు పరిష్కారం కోసం అలుపెరుగనిపోరాటం చేసిన గొప్పనాయకుడు సీనియర్ జర్నలిస్ట్ అమరనాథ్ గారు మృతి జర్నలిస్ట్ ఉద్యమంకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *