TT Ads

పాఠశాలనే బార్ గా మార్చిన టీచర్ పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియా డుతున్న వైనం,ఇది ప్రత్యక్షంగా వీడియో చిత్రీకరిస్తున్న ఓ మహిళతో బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ బరితెగించి ప్రవర్తించిన టీచర్.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల నందు గురువారం పాఠశాలనే బార్ గా మార్చిన టీచర్,పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడుతున్నడు,

అది అడిగిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్యకరంగా పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు,ఇది ప్రత్యక్షంగా వీడియో చిత్రీకరిస్తున్న ఓ మహిళతో బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ బరితెగించి ప్రవర్తించిన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది.విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్య బోధన సమయంలో మద్యం సేవిస్తూ, విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఒళ్ళు గగుర్లు పొడిచేలా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడు అని చెప్పారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *