TT Ads

తాళ్లపూడి లోని సాయి స్ఫూర్తి ఆస్పత్రిలో ఈనెల 22 గురువారం న కాన్పు సమయం అవడంతో అడ్మిట్ అయిన మలకపల్లి గ్రామానికి చెందిన శిరీష.24 న నొప్పులు రావడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు. కాన్పు సమయంలోనే ఆడ శిశువు మృతి.కాన్పు అయిన వెంటనే శిరీష పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం ఉదయం 11 గంటలకు అంబులెన్స్లో రాజమండ్రి లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పంపిన సాయిస్ఫూర్తి వైద్యులు.నేడు ఆదివారం చికిత్స పొందుతూ రాజమండ్రి లోని ప్రైవేట్ ఆసుపత్రిలో శిరీష మృతి.తాళ్లపూడి సాయి స్ఫూర్తి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిరీష మృతి చెందిందని, శిరీష పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాత రాజమండ్రి పంపించి ,ఆసుపత్రి వైద్యులు చేతులు దులుపుకున్నారు అని బంధువుల ఆరోపణ.నిర్లక్ష్యంతో శిరీష మృతికి, శిశువు మృతికి కారణమైన తాళ్లపూడి కి చెందిన సాయిస్ఫూర్తి ఆస్పత్రి పై కేసు నమోదు చేసి, శిరీష కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన శిరీష బంధువులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *