TT Ads

బంగారు ఆభరణాలు వేసుకుని ఒంటరిగా ఉన్న మహిళలతో పరిచయం పెంచుకుని బంగారానికి ఫైనాన్స్ చేయిస్తానని నమ్మబలికి అమాయక మహిళలను చీట్ చేస్తున్న చిట్టిబాబు.నిందుతుని నుండి పది తులాల బంగారు ఆభరణాలు, ఒక బైకు స్వాధీనం.

మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ: ఘరానా చీటర్ మేడిశెట్టి చిట్టిబాబు ను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు.ఏపీ లోని వైజాగ్ కు చెందిన చిట్టిబాబు రాజేంద్ర నగర్ లో ఉంటూ మహిళలను చీట్ చేసేవాడు.గ్రామీణ ప్రాంతాల్లో, సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలోని పూలు, ఫ్యాన్సీ స్టోర్, కల్లు దుకాణాలలో పనిచేసే మహిళలే టార్గెట్.చిట్టిబాబు పై గతంలో ఆంద్రప్రదేశ్ లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.2014 లో అరెస్టు అయి జైలుకు వెళ్ళాడు.జైలు నుంచి విడుదల అయిన తరువాత 14 కేసుల్లో ఉన్నాడు.జనవరి లో నగరంలోని రాజేంద్ర నగర్ కు వచ్చి ఒంటరి మహిళలను చీట్ చేశాడు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *