TT Ads

– మందా వెంకటేశ్వర్లు మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మార్చి 19 ఖమ్మం : ఈ ఆర్థిక బడ్జెట్ లో జీతాలు పెరుగుతాయి అనుకున్న మున్సిపల్ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. వేలాది మంది ఉద్యోగ కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నవారికి బడ్జెట్లో జీతాలు పెంపుదల అంశం ప్రస్తావించక పోవడంతో కేసీఆర్ ప్రభుత్వం కపట ప్రేమ తేట తెల్లమైందని శనివారం ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసీ) రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు కె. యెుసురత్నం, మందా వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ
మంత్రి టి.హరీష్ రావు ప్రవేశపె
ట్టిన 2,30, 826 కోట్ల బడ్జెట్లో మున్సిపల్, గ్రామ పంచాయతీ రంగాలను పూర్తిగా విస్మరించారని ఈ బడ్జెట్ పూర్తిగా మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బందికి వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణలో మున్సిపల్, గ్రామ పంచాయతీ రంగాలపై ఆధారపడి పని చేస్తూ జీవిస్తున్న ఉద్యోగ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 141 కార్పోరేషన్, మున్సిపాలిటీ ల్లో సుమారు 70 మంది పైబడి, గ్రామ పంచాయతీల్లో వందలాది మంది పనిచేస్తున్న వీరికి సొంత ఇల్లు లేక వచ్చే తక్కువ జీతంతో అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతు
న్నారని, టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి
ఏడు సంవత్సరాలు అవుతున్నా నేటికీ మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన పాపాన పోలేదన్నారు . ఈ ఆర్థిక సంవత్సరంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 11 వేల కోట్లు కేటాయించారని ఇప్పటికైనా మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా 11వ పీఆర్సీ అమలు చేస్తూ మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సిబ్బందికి కనీస వేతనం రూ. 21,000/-లుగా నిర్ణయించి చెల్లించేలా సమావేశాల్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పంచాయతీల నుండి అప్ గ్రేడ్ అయిన కొత్త మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జీతాల ప్రస్తావన గురించి బడ్జెట్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు వాటి ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరం అన్నారు.ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం బడ్జెట్ లో పెద్దపీట వేశారని, గతబడ్జెట్ లో కూడా దళిత, గిరిజనులకు కేటాయించిన డబ్బులను ఖర్చు చేయలేదని వాటిని ఇతర రంగాలకు మళ్లించారని ఆరోపించారు. మున్సిపల్, పంచాయతీ రంగంలో ఎక్కువ శాతం మంది దళితులే పనిచేస్తున్నారని ఈ బడ్జెట్ లోనైనా వారి సంక్షేమానికి కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని కోరారు. కేసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్ప మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రయోజనాలకు అనుకూలంగా బడ్జెట్ లేదని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *