TT Ads

ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య (APUCF)కన్వీనర్ సిహెచ్ బాబూరావు ప్రకటనపట్టణాలలో చెత్తపన్ను (సేవాచార్జీలు)వసూళ్లు ఆదేశాలను ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలి.నిన్న జరిగిన ఉన్నతా ధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పట్టణాలలో గ్రేడ్ 1,2,3 మున్సిపాలిటీలలో రోజుకు ఒక రూపాయి చొప్పునసంవత్సరానికి రూ.365లు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలలో రోజుకు 2రూపాయల చొప్పున సంవత్సరానికి రూ730/-లు, నగరపాలక సంస్థలలో రోజుకి రూ.3/-చొప్పున సంవత్సరానికి 1100 రూపాయలు ప్రతి కుటుంబం నుండి చెత్త సేకరణపై సేవా చార్జీలు(చెత్త పన్ను)వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.పారిశుద్ధ్య నిర్వహణకు అదనపు వాహనాల ఏర్పాటుకు, ఇంటింటికి చెత్త సేకరణకు చర్యలు చేపట్టడం హర్షణీయమే.కానీ ఏనాడు లేని విధంగా చెత్త సేకరణపై చార్జీలువసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వటం శోచనీయం.మున్సిపల్ ఎన్నికలు ఇటీవలనే ముగిసాయి. వైయస్సార్ పార్టీకి అఖండ మెజారిటీని ప్రజలు ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పౌరసేవలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన,ఎన్నికైన కౌన్సిల్స్ పైన ఉన్నది.ఇంకా కొత్త కౌన్సిల్స్ కొలువు తీరలేదు,ఎన్నికైనకౌన్సిల్ తమ పట్టణాలలో సుపరిపాలనకు తగు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.కానీ ఎన్నికైన కౌన్సిల్స్ ను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చెత్త పన్ను వసూలు ఆదేశాలివ్వడం స్థానిక సంస్థల స్వయం నిర్ణయాధికారాన్ని కాలరాచి వేయటమే అవుతుంది.పౌర సేవలను వ్యాపార సరుకులుగా మార్చటం తగదు, పన్నుల భారాలు మోపడం ప్రజలు ఇచ్చిన తీర్పు కి తూట్లు పొడవడం అవుతుంది.కావున చెత్తపై సేవా చార్జీల వసూళ్ల నిర్ణయాన్నిముఖ్య మంత్రి తక్షణమే ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేస్తున్నాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *